స్టాలిన్ కు ఫోన్ చేసి, థ్యాంక్స్ చెప్పిన కేసీఆర్!

  • కేసీఆర్ ధర్నాకు స్టాలిన్ మద్దతు
  • ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పిన కేసీఆర్
  • కలసికట్టుగా ముందుకు సాగాలని నేతల నిర్ణయం
తెలంగాణలో రిజర్వేషన్ల పెంపుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను అమలు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలనే డిమాండ్ తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేసీఆర్ ధర్నా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో, డీఎంకే అధినేత కరుణానిధి తరపున కేసీఆర్ కు తాను సంఘీభావం తెలుపుతున్నానంటూ స్టాలిన్ నిన్న ప్రకటించారు.

ఈ నేపథ్యంలో, స్టాలిన్ కు ఈరోజు కేసీఆర్ ఫోన్ చేశారు. రాష్ట్ర హక్కులను సాధించుకునే క్రమంలో తాను చేపట్టిన కార్యక్రమానికి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్ల సాధనలో కలసికట్టుగా ముందుకు సాగాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రాల అధికారాల కోసం తాము చేస్తున్న కృషికి స్టాలిన్ మద్దతు పలికారని చెప్పారు.
Go Back to Shorts
KCR
ts chief minister
stallion
dmk
kcr dharna

More Telugu News